కేన్సర్ బారిన పడి న్యూయార్క్లో చికిత్స పొందుతున్న బాలీవుడ్ ప్రముఖ నటి సోనాలీ బింద్రే తన సరికొత్త ఫొటోను అభిమానులతో పంచుకుంది. చికిత్స కోసం గతంలో గుండు చేయించుకున్న సోనాలి.. ఇప్పుడు విగ్గుతో ఉన్న ఫొటోను ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసింది. మరో నటి ప్రియాంక చోప్రా సలహాతో విగ్గును తీసుకున్నట్టు చెప్పింది. ఎవరైనా అందంగా కనిపించాలనే కోరుకుంటారని, గ్లామర్ రంగంలో ఉన్న వారికి ఇది మరింత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. ఎవరైనా అందంగా కనిపించాలనే కోరుకుంటారని, అందుకు తానేం అతీతం కాదని కుండబద్దలుగొట్టింది.
అందంగా ఉంటేనే తాను సౌకర్యంగా ఉండగలుగుతానని సోనాలీ పేర్కొంది. గుండు గీయించుకున్న తర్వాత తనకెలా ఉండాలనిపిస్తే అలానే ఉండేదాన్ననని, కొన్ని సార్లు గుండుతో, మరికొన్ని స్కార్ఫ్ కట్టుకునేదాన్ననని గుర్తు చేసుకుంది. నేనెలా సౌకర్యంగా ఉంటానో తనకు మాత్రమే తెలుసని, తనకీ సలహా ఇచ్చిన ప్రియాంక చోప్రాకు ధన్యవాదాలని సోనాలి తెలిపింది.
Be the first to comment