ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్

బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరారు. చెస్ట్ ఇన్ఫెక్షన్‌తో ఈరోజు ఆసుపత్రిలో చేరినట్టు స్వయంగా ట్వీట్ చేశారు. చెస్ట్ ఇన్ఫెక్షన్ కారణంగా కొంత అస్వస్థతగా ఉందని అందులో పేర్కొన్నారు. మీ ప్రేమ, ప్రార్థనలు కావాలని ట్వీట్ చేశారు. త్వరలోనే కోలుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశారు.

దిలీప్ కుమార్ 1998లో చిత్రపరిశ్రమకు దూరమయ్యారు. చివరిసారిగా ‘కిలా’ చిత్రంలో నటించారు. ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణించడంతో బయటకు రావడం మానేశారు. గత కొన్నేళ్లలో ఆయన కొన్ని సందర్భాల్లో మాత్రమే కనిపించారు.

దిలీప్ కుమార్ ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న పెషావర్‌లో జన్మించారు. హిందీ చిత్రపరిశ్రమలో ఆయన ‘ట్రాజెడీ కింగ్’గా అభిమానుల మన్ననలు అందుకున్నారు. భారతీయ చిత్రపరిశ్రమలో ఉన్న అతికొద్ది మంది సూపర్ స్టార్లలో దిలీప్ కుమార్ ఒకరు. ‘నయా దౌర్’, ‘మొఘల్-ఇ-ఆజం’, ‘దేవ్‌దాస్’, ‘ఆనంద్’, ‘విధాత’, ‘శక్తి’, ‘కర్మ’ తదితర సూపర్ హిట్ చిత్రాల్లో దిలీప్ కుమార్ నటించారు. 95 ఏళ్ల దిలీప్ కుమార్‌ను 2015లో భారత ప్రభుత్వం ‘పద్మ విభూషణ్’ పౌర పురస్కారంతో సత్కరించింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*