
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి జి.పరమేశ్వర వివాదంలో చిక్కుకున్నారు. ఉల్సూరులో పర్యటించిన మంత్రి ప్యాంటుకు బురద అంటడంతో గన్‌మెన్‌ను పిలిచి ప్యాంటును శుభ్రం చేయించుకున్నారు. గన్‌మెన్ ఆయన ప్యాంటును శుభ్రం చేస్తుండగా ఎవరో సెల్ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడంతో అదికాస్తా వైరల్ అయింది. మంత్రి తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన మంత్రి ఇలాంటి పనులు చేయించుకుని ప్రజలకు ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మంగళవారం మంత్రి ఉల్సూరులోని ఎల్లమ్మ కోయిల్ వీధిలో పర్యటించారు. నడుస్తుండగా ఆయన ప్యాంటుకు బురద అంటింది. అది చూసిన స్థానిక నేత ఒకరు దానిని శుభ్రం చేసేందుకు ముందుకు రాగా, ఆయనను వారించిన మంత్రి గన్‌మెన్‌ను పిలిచి ప్యాంటును శుభ్రం చేయించుకున్నారు. రుమాలుతో గన్‌మెన్ ప్యాంటును శుభ్రం చేసిన తర్వాత మంత్రి పరమేశ్వర చిందించారు.
Watch: Gunman cleans deputy CM G Parameshwara’s trousers, clip goes viral pic.twitter.com/d6xtxzPktU
— TOI Bengaluru (@TOIBengaluru) September 5, 2018
సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న మంత్రి వీడియోను చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు. గన్‌మెన్‌తో ప్యాంటును శుభ్రం చేయించుకోవడం సిగ్గు చేటని, అందుకు సిగ్గుపడాలని, చేసిన పనికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. నేను మంత్రిని కాబట్టి అందరూ నాకు సేవలు చేయాలనే మైండ్ సెట్‌ను మార్చుకోవాలని సూచించారు. మంత్రిగా ఉంటారో, కంత్రీగా ఉంటారో తేల్చుకోవాలని మరికొందరు నెటిజన్లు కామెంట్ చేశారు.
Be the first to comment