క్రికెట్‌లో ఇలా కూడా అవుటవుతారా?.. వీడియో చూడండి!

ఆస్ట్రేలియాలోని ఎన్పీసీ, విక్టోరియా జట్ల మధ్య ఆదివారం జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఎప్పుడూ కనీవినీ ఎరుగని రీతిలో బ్యాట్స్‌మన్ హిట్ వికెట్ అయ్యాడు. సాధారణంగా హిట్ వికెట్ అంటే వికెట్లకు బ్యాట్ తగలడమో, కాలో, చెయ్యో తగలడమో జరుగుతూ ఉంటుంది. కానీ ఇది మాత్రం కొంచెం వెరైటీ.

ఆసీస్ ఆటగాడు జేక్ వెదర్లాండ్ బ్యాటింగ్ చేస్తూ ఫ్రంట్‌పుట్ వచ్చి షాట్ కొట్టేందుకు ప్రయత్నించాడు. అయితే, అదికాస్తా గురితప్పింది. బంతికి బదులు చేతిలోని బ్యాట్ గాల్లోకి లేచి తలపై నుంచి వెనక్కి వెళ్లి లెగ్‌స్టంప్‌ను గిరాటేసింది. అంతే.. జేక్ అవుటైనట్టు అంపైర్ ప్రకటించాడు. అసలేం జరిగిందో తెలియని జేక్ కాసేపు బిత్తరపోయి అలాగే నిల్చుండిపోయాడు. జేక్ హిట్ వికెట్ వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా ట్విట్టర్‌లో పోస్టు చేయగా అది క్షణాల్లోనే వైరల్ అయింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*