అనంతపురం పోలీసులపై జేసీ సెటైర్లు!

సంచలన వ్యాఖ్యలు, సెటైర్లతో నిత్యం వార్తల్లో నిలిచే అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఈసారి పోలీసు వ్యవస్థపై పడ్డారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన అనంతపురంలో పాలన పూర్తిగా దెబ్బతింటోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసుల లాఠీ చేవ చచ్చిపోయిందని విమర్శలు గుప్పించారు. నేరగాళ్లకు మర్యాదలు చేసే స్థాయికి పోలీసులు చేరుకున్న దుస్థితి దాపురించిందన్నారు. ఫ్రెండీ పోలీసింగ్ అంటూ వ్యవస్థను మొత్తం నీరుగార్చారని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి.

జేసీ గతంలోనూ పలుమార్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో దీక్ష చేస్తుంటే.. జేసీ మాట్లాడుతూ ఎంపీలు ఢిల్లీలో ఎన్ని దీక్షలు చేసినా, ఎంత అరిచి గీపెట్టుకున్నా మోదీ ప్రత్యేక హోదా ఇవ్వరని, ధర్నాలు, దీక్షలు వేస్ట్ అని సొంత పార్టీ నేతలకు సూచించారు. ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్రపైనా సెటైర్లు వేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*