
రాజమండ్రి: నివేదిత కిషోర్ విహార్ పాఠశాలలో గణితం, సైన్స్ బోధించే ఉపాధ్యాయురాలు మేకా సుసత్య రేఖ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయిని పురస్కారం పొందారు. సుసత్య రేఖ సేవలను కొనియాడుతూ ప్రధాని స్వయంగా ట్వీట్ చేశారు. ప్రశంసల జల్లు కురిపించారు. విద్యార్ధులకు గణితం అంటే ఆసక్తి ఏర్పడేలా సుసత్య రేఖ చేపడుతున్న కార్యక్రమాలను ప్రధాని ప్రశంసించారు.
సుసత్య రేఖ కుటుంబమంతా ఉపాధ్యాయులే. అమ్మ సత్యవతి దేవి, తాత వెంకన్న చౌదరి హిందీ పండిట్లు. నాన్న సత్యనారాయణ సోషల్ టీచర్. వీరంతా ఇప్పటికే రిటైర్ కాగా ఆమె భర్త గురయ్య, అక్క ఇంద్రాణి, బావ వీరన్న, చెల్లెలు పద్మజారాణి, మేనమామ సత్యనారాయణ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు.
సుసత్య రేఖకు జాతీయ స్థాయి పురస్కారం రావడంతో రాజమండ్రి వాసులు పండగ చేసుకుంటున్నారు. ఆమె పనిచేస్తున్న నివేదిత కిశోర్ విహార్ పాఠశాల సిబ్బంది, విద్యార్ధులు సంబరాలు చేసుకుంటున్నారు.
Be the first to comment