
విజయవాడలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. సామాజిక సేవ ముసుగేసుకున్న కొన్ని ముఠాలు యథేచ్ఛగా వ్యభిచార దందా నిర్వహిస్తూ చెలరేగిపోతున్నారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేయడంతో విషయం వెలుగు చూసింది.
పటమట పోలీసుల కథనం ప్రకారం.. పటమటలోని దానయ్య బజార్లో నివసిస్తున్న ఇద్దరు మహిళలు సమరం ఆసుపత్రి పేరుతో హెచ్ఐవీ రోగులకు కౌన్సెలింగ్ కేంద్రం నిర్వహిస్తున్నారు. కౌన్సెలింగ్ కోసం అక్కడికి వచ్చే బాధిత మహిళలకు మాయమాటలు చెప్పి వ్యభిచార రొంపిలోకి దింపి సొమ్ము చేసుకుంటున్నారు. అదే బజారులో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా దందా నిర్వహిస్తున్నారు. వీరి కదలికలపై అనుమానం రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వ్యభిచార గృహంపై దాడులు జరిపిన పోలీసులు ఆరుగురు మహిళలు, ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 13వేల నగదు, 12 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
Be the first to comment