
సిన్సినాటి: అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. సిన్సినాటిలో దుండగుడు జరిపిన కాల్పుల్లో నలుగురు చనిపోయారు. మృతుల్లో తెనాలికి చెందిన కందేపి పృధ్వీరాజ్ కూడా ఉన్నాడు. 26 సంవత్సరాల పృధ్వీరాజ్ తెనాలి చెంచుపేట వాసి. పృధ్వీరాజ్ చనిపోయాడని తెలిసి అతడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరౌతున్నారు.
సిన్సినాటిలోని 31 అంతస్థుల భవనంలోని బ్యాంక్‌లోకి బిజినెస్ సూట్లో 9 ఎంఎం సెమీ ఆటోమాటిక్ పిస్టల్, వందలాది రౌండ్లతో జొరబడిన సాయుధుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో సాయుధుడు కూడా చనిపోయాడు. దుండగుడిని ఒమర్ ఎన్రిక్ పెరెజ్గా గుర్తించారు. కాల్పులకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఉగ్రవాద కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు.
కందేపి పృధ్వీరాజ్ చదువు పూర్తయ్యాక సిన్సినాటిలోని బ్యాంక్‌లో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే సాయుధుడు ఒమర్ ఎన్రిక్ పెరెజ్ జరిపిన కాల్పుల్లో చనిపోయాడు. పృధ్వీరాజ్ తండ్రి గృహ నిర్మాణశాఖలో డిప్యూటీ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. త్వరలోనే పృధ్వీరాజ్ వివాహం చేయాలని అనుకుంటుండగా ఈ దారుణం జరగడాన్ని కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.
Be the first to comment