105 మంది టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ రద్దుకు గవర్నర్ నరసింహన్ ఆమోదం తెలిపి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరాక కేసీఆర్‌ టీఆర్‌ఎస్ భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 105 మంది టీఆర్ఎస్ అభ్యర్ధులను ప్రకటించి సంచలనం సృష్టించారు.

కేసీఆర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే

అనేక త్యాగాలు, పోరాటాలతో తెలంగాణ సిద్ధించింది

-రాష్ట్రం ఏర్పడ్డాక ఉన్న అనేక సందేహాల మధ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం

– ఈ మధ్య తెలంగాణలో రాజకీయ అసహన వైఖరిని చూస్తున్నాం

– టీఆర్ఎస్ సాధించిన ప్రగతిని స్వయంగా ప్రధాని, అనేక రాష్ట్రాలు కొనియాడాయి

– నాలుగేళ్లుగా 17.17 శాతం ఆర్థిక ఎదుగుదల సాధించింది

– గత ఐదు నెలలుగా 21.96 శాతం ఆర్థిక వృద్ధి నమోదు కావడం దేశంలోనే అత్యధికం

– 10 పైన వృద్ధి ఉన్న ఒకట్రెండు రాష్ట్రాలు మినహాయిస్తే మిగిలినవన్నీ సింగిల్ డిజిట్ తో ఉన్నాయి

– నీటిపారుదల ప్రాజెక్టులపై రకరకాల సమావేశాలు పెట్టి అవగాహన లేని వ్యక్తులు అవాకులు చెవాకులు పేలుతున్నారు

– ఇప్పటి వరకు తెలంగాణకు 40 అవార్డులు వచ్చాయి

– మిషన్ భగీరథ, కాకతీయ పెడితే కమీషన్లు అంటున్నారు

– ఇన్నాళ్లుగా చేసిన ఆరోపణల్లో ఒకదానికైనా ఆధారం చూపలేదు

– గత ఆర్థిక సంవత్సరంలో నీటిపారుదల రంగంలో తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం 25 వేల కోట్లు

– గత కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల్లో కరెంట్ కోతలతో ప్రజలంతా ఏడ్చేవాళ్లు

– ఫిక్కీ ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలే ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేసిన పరిస్థితులున్నాయి

కేసీఆర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే

-35 ఏళ్ల పాటు విద్యుత్ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడ్డాం

– ఇప్పుడు కరెంట్ కోతలు లేకుండా చేస్తే దానిపైనా విమర్శలు, అవినీతి ఆరోపణలు

– ఆరునూరైనా ఈ ప్రగతి ఆగకూడదనే దృక్పథంతోనే మేం త్యాగం చేశాం

– మేం రాజకీయాలు, మంత్రివర్గ మార్పులు ఇష్టానుసారంగా చేయలేదు

– తెలంగాణలో ఎవరైనా త్యాగం చేశారంటే అది మేమే

– ఒక్క ఎమ్మెల్యే కూడా మనకు సమయం ఉందని, ఆగుదామని అడ్డుపడకుండా త్యాగానికి సిద్ధపడ్డారు

– ఇప్పుడు 105 మంది అభ్యర్థులను ప్రకటిస్తున్నాం

– ఇద్దరు ఎమ్మెల్యేలకు మాత్రమే టికెట్లు నిరాకరించాం

– మంచిర్యాల జిల్లా చెన్నూరు అభ్యర్థి, సంగారెడ్డి జిల్లా ఆంథోల్ అభ్యర్థులకు టికెట్లు ఇవ్వలేకపోయాం

– ఐదు నియోజకవర్గాలు మేడ్చల్, మల్కాజిగిరి, చొప్పదండి, వరంగల్ తూర్పు, వికారాబాద్ నియోజకవర్గాలను పెండింగ్ లో పెట్టాం

– మిగిలిన అందరు సిట్టింగ్ లకు టికెట్లు ఖరారు చేశాం

– ప్రకటించిన 105 మంది సిట్టింగ్ నేతలు బయలుదేరి వస్తున్నారు

– వీరితో 7 గంటలలోపు సమావేశం నిర్వహిస్తున్నాం-

 

కేసీఆర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే

హుస్నాబాద్ లో తొలి ప్రచార సభ నిర్వహించబోతున్నాం

– ఎన్నికలు కూడా ముందుగానే వచ్చే అవకాశం ఉంది

– రాజ్యాంగం ప్రకారం, సుప్రీం తీర్పుల మేరకు త్వరగా ఎన్నికలు జరగాల్సి ఉంది

– 15 నుంచి 20 సర్వేలు చేసిన తర్వాతే అభ్యర్ధులపై నిర్ణయం తీసుకున్నాం

– అక్టోబర్ మొదటి వారంలో ప్రాసెస్ మొదలై నవంబర్ లో ఎన్నికలు జరుగుతాయి

– డిసెంబర్ మొదటి వారంలో ఫలితాలు రాబోతున్నాయి

– సీఈసీతో మాట్లాడి నిర్ణయం తీసుకున్నా

– కచ్చితంగా నాలుగు రాష్ట్రాలతో కలిసి ఎన్నికలు జరిగే అవకాశముంది

– ఇవి ముందస్తు ఎన్నికలేం కావు, కొంత మాత్రమే ముందుకు జరిగాయి

– కేసీఆర్ ఏం చేసినా తెలంగాణ శ్రేయస్సుకే చేస్తాడు కాని కీడు కోసం కాదు

– మేనిఫెస్టోలో పెట్టినవి 99.99 చేశాం

– దానికి మించి 76 పథకాలు మేనిఫెస్టోలో లేకపోయినా అమలు చేశాం

– తెలంగాణలో నేడు పేకాట క్లబ్బులు, గుడుంబా అడ్డాలు, ఎరువుల కోసం చూసే పరిస్థితులు, లాఠీచార్జీలు, మత కలహాలు లేవు

– పటిష్టమైన లా అండ్ ఆర్డర్ ను అమలు చేస్తున్నాం

– ఏ రాష్ట్రం వాళ్లు వచ్చినా ఇక్కడ కొంత నేర్చుకుని వెళ్తున్నారు

– కాళేశ్వరాన్ని చూసిన సీడబ్ల్యూసీ చైర్మన్ కూడా అద్భుతంగా ఉందని, తమ ఇంజనీర్లను పంపుతామని చెప్పారు-

 

కేసీఆర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే

ప్రగతి నివేదన సభలో నా ప్రసంగం చప్పగా ఉందన్నారు కానీ సందర్భోచితంగానే మాట్లాడాలి

– కేసీఆర్ కు మాట్లాడటం, చెప్పడం రాక కాదు

– మాపై ఆరోపణలు చేస్తున్న పార్టీల చరిత్ర మనందరికీ తెలుసు

– తెలంగాణకు విలన్ నంబర్ 1 కాంగ్రెస్

– ఈ మాట 2001లోనే చెప్పా

– ఉన్న తెలంగాణను ఊడగొట్టింది జవహర్ లాల్ నెహ్రూ

– 1956 నవంబర్ 1 తెలంగాణకు కాలాదిన్

– తర్వాత వందలమందిని కాల్చి చంపి, ప్రజాతీర్పును కాలరాసిన మరో నియంత ఇందిరా గాంధీ

– వైఎస్సార్ హయాంలో కూడా మాయ చేసి మభ్యపెట్టారు

– చివరకు చచ్చిపోతామంటే నాలుగు సీట్లొస్తాయనే లాలూచీతో తెలంగాణ ప్రకటించారు

– తెలంగాణ కాంగ్రెస్ భిక్ష కాదు మనం కొట్లాడి తెచ్చుకున్నాం

– అలాగే చంద్రబాబునాయుడిని కూడా బండకేసి కొట్టి తెలంగాణ కోసం ముందుకు పోయాం

– మీరు నాశనం చేసిన తెలంగాణ పీడను విడిపించింది కేసీఆర్

– పేదల గురించి ఆలోచించక తప్పదని కాంగ్రెస్ మెడలు వంచింది కేసీఆర్

– నేను వందంటే మీరు రెండొందలనే పోటీ ఆరోగ్యకరమైనది కాదు-

కేసీఆర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే

ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే కేబినెట్లో 42 నిర్ణయాలు తీసుకున్నాం- ఈ అభివృద్ధి స్థిరత్వం చెడిపోకుండా ఉండాలనే మేం ఇప్పుడు త్యాగం చేశాం- ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజలేం తీర్పు ఇస్తే దాన్ని తీసుకుందాం- రేపటి నుంచి మా ఎన్నికల కార్యాచరణ, ప్రచారం ఉంటుంది- 50 రోజుల్లో వంద సభలు నిర్వహించి ప్రజలకన్నీ నేనే చెబుతా- నూరు స్థానాల్లో మేం 50 శాతం పైన ఉన్నాం- కనుక అన్ని పార్టీలు కలిసినా మాకు వంద సీట్లు వస్తాయనే నమ్మకం ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*