తెలంగాణ అసెంబ్లీ రద్దుకు గవర్నర్ ఆమోదం… ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనున్న కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ రద్దుకు గవర్నర్ నరసింహన్ ఆమోదం తెలిపారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కేసీఆర్‌ను కోరారు. ఇకపై కేసీఆర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తూ రాజ్ భవన్ నోటిఫికేషన్ ఇవ్వనుంది. టీఎస్ అసెంబ్లీ రద్దు నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం, అసెంబ్లీ కార్యదర్శికి పంపనున్నారు. ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం తుది నిర్ణయం తీసుకోనుంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. 4 రాష్ట్రాలతో పాటు తెలంగాణలో కూడా ఎన్నికలు జరగనున్నాయి.

అంతకు ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. చెప్పినట్లే 9 నెలల ముందుగానే అసెంబ్లీని రద్దు చేశారు. ప్రగతిభవన్‌లో కేబినెట్ సమావేశంలో శాసన సభను రద్దు చేస్తూ తీర్మానం ఆమోదించారు. మంత్రులతో కలిసి రాజ్ భవన్‌కు చేరుకున్నారు. అసెంబ్లీ రద్దు తీర్మానాన్ని గవర్నర్‌కు అందించారు. మొత్తం 4 సంవత్సరాల 3 నెలలా 4 రోజుల పాటు కేసీఆర్ పాలన కొనసాగింది. రేపటి నుంచి టీఆర్ఎస్ ఎన్నికల శంఖారావం మొదలుకాబోతోంది.

టీఆర్‌ఎస్ భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి ప్రభుత్వ రద్దు నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించనున్నారు.ఈ సాయంత్రం కేసీఆర్ గజ్వేల్‌కు చేరుకుంటారు. రేపు కోనాయపల్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. ఆ తర్వాత హుస్నాబాద్ బహిరంగ సభకు వెళ్లి ప్రచారం మొదలుపెడతారు. జూన్ 2, 2014న కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ్టికి ప్రభుత్వం ఏర్పడి 4సంవత్సరాల 3నెలల 4రోజులు అయింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*