
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. చెప్పినట్లే 9 నెలల ముందుగానే అసెంబ్లీని రద్దు చేశారు. ప్రగతిభవన్‌లో కేబినెట్ సమావేశంలో శాసన సభను రద్దు చేస్తూ తీర్మానం ఆమోదించారు. మంత్రులతో కలిసి రాజ్ భవన్‌కు చేరుకున్నారు. అసెంబ్లీ రద్దు తీర్మానాన్ని గవర్నర్‌కు అందించారు.
జూన్ 2, 2014న కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 4 సంవత్సరాల 3 నెలలా 4 రోజుల పాటు కేసీఆర్ పాలన కొనసాగింది. రేపటి నుంచి టీఆర్ఎస్ ఎన్నికల శంఖారావం మొదలుకాబోతోంది.
టీఆర్ఎస్ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించి ప్రభుత్వ రద్దు నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించనున్నారు.ఈ సాయంత్రం కేసీఆర్ గజ్వేల్‌కు చేరుకుంటారు. రేపు కోనాయపల్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. ఆ తర్వాత హుస్నాబాద్ బహిరంగ సభకు వెళ్లి ప్రచారం మొదలుపెడతారు.
Be the first to comment