ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ నటి పాయల్ చక్రవర్తి

ప్రముఖ నటి పాయల్ చక్రవర్తి బలవన్మరణానికి పాల్పడ్డారు. సిలిగురిలోని ఓ హోటల్‌లో ఆమె ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. గ్యాంగ్‌టక్ వెళ్లేందుకు సిలిగిరికి వచ్చిన పాయల్ హోటల్ గది అద్దెకు తీసుకున్నారు. తనకు ఎవరూ అంతరాయం కలిగించవద్దని హోటల్ సిబ్బందికి ముందే చెప్పిన ఆమె ఆ రాత్రికి ఆహారం కూడా తీసుకోలేదు.

పొద్దుపోయినా ఆమె గది నుంచి బయటకు రాకపోవడంతో హోటల్ సిబ్బంది తలుపు తట్టారు. అయినా స్పందించకపోవడంతో తలుపు బద్దలు కొట్టారు. గది లోపల ఆమె ఫ్యాన్‌కు ఉరేసుకుని కనపడటంతో పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపారు.

పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారా లేక ఎవరైనా ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా అనేది తేలాల్సి ఉంది. 35 సంవత్సరాల పాయల్ బెంగాల్ సినిమాలతో పాటు సీరియళ్లలో నటించి నటిగా గుర్తింపు పొందారు. పాయల్ ఆకస్మిక మరణాన్ని బెంగాల్ సినీ పరిశ్రమ జీర్ణించుకోలేకపోతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*