
రాజమండ్రి: రాజా ఆఫ్ కరెప్షన్ బుక్పై చర్చకు సిద్ధమని మాజీ ఎంపీ సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రకటించారు. వైఎస్ అవినీతికి పాల్పడలేదని తాను ఎప్పుడైనా చెప్పానా అని ప్రశ్నించారు. వైఎస్ మనీ టేకింగ్ చేశారని, మనీ మేకింగ్ చేయలేదన్నారు.
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ప్రభుత్వం జీతం తీసుకుంటూ టీడీపీ ప్రతినిధిగా మారారని ఆరోపించారు. చంద్రబాబుపై ఈర్ష్య ఉంటే తాను వెళ్లి ఎందుకు కలుస్తానని ఉండవల్లి ప్రశ్నించారు. మార్గదర్శిపై త్వరలో మరిన్ని వాస్తవాలు బయటపెడతానన్నారు.
రాజా ఆఫ్ కరెప్షన్ బుక్పై కెమెరాల మధ్య చర్చిద్దామన్నారు. కేవలం ఈ బుక్ మీదే కాకుండా గుడ్, బాడ్ అండ్ అగ్లీ, పట్టిసీమ, పోలవరం అమరావతి డాక్యుమెంట్లపై కూడా చర్చిద్దామని ఉండవల్లి చెప్పారు.
Be the first to comment