“అగ్రిగోల్డ్” లో మరో ముందడుగు !

2015 న తెలుగు రాష్ట్రాల ఉమ్మడి న్యాయస్థానంలో మొదలైన ఈ వ్యాజ్యం వి.రామసుబ్రమణ్యం మరియు ఎస్.వి.భట్ లతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. సుభాష్ చంద్ర ఫౌండేషన్ వారు ఈ వ్యాజ్యంలో అంతర్భాగం కావటం, అగ్రిగోల్డ్‌కు సంబంధించిన ఆస్తులను విక్రయిస్తానని ప్రకటించటం తెలిసిందే.

కాగా, ధర్మాసనం ఫౌండేషన్ ప్రతినిధులను ప్రధానంగా కొన్ని అంశాలపై స్పష్టత కోరారు. అగ్రిగోల్డ్‌కు సంబంధించి ఎన్ని ఆస్తులు విక్రయిస్తారు? ఎంత కాలపరిమితిలో విక్రయిస్తారు? ఏమేమి ఆస్తులు విక్రయిస్తారు? ప్రభుత్వం తరపున ఎటువంటి సహకారం కావాలి? ఈ అంశాలపైనా సవివరమైన నివేదికతో తదుపరి విచారణ గడువు సెప్టెంబర్ 17 2018 నాడు హాజరుకావాలని ఆదేశించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*