
తెలంగాణ అసెంబ్లీ రద్దు నేపథ్యంలో శాసనసభ ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం నేడు (శుక్రవారం) నిర్ణయం తీసుకోనుంది. సాధారణంగా ప్రతీ మంగళ, శుక్రవారాల్లో ఈసీ సమావేశం అవుతూ వివిధ అంశాలపై చర్చిస్తూ ఉంటుంది. కాబట్టి నేటి సమావేశంలో తెలంగాణలో పరిణామాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. తెలంగాణ అసెంబ్లీ రద్దుతో ఎన్నికల నిర్వహణపై నేటి సమావేశంలో చర్చించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పండుగలు, పరీక్షలు, వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న అనంతరం ఎన్నికల నిర్వహణపై తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని ఆయన వివరించారు.
Be the first to comment