అందుకే టీఆర్ఎస్‌లో చేరుతున్నాను: సురేశ్ రెడ్డి

హైదరాబాద్: మాజీ స్పీకర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సురేశ్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరారు. మాజీ మంత్రి కేటీఆర్ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి సురేశ్‌రెడ్డితో మంతనాలు జరిపారు. ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేటీఆర్, సురేశ్ రెడ్డి మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తాను కృషి చేశానని సురేశ్ రెడ్డి చెప్పారు. ఈ నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనలో నిశ్శబ్ద అభివృద్ది విప్లవాన్ని చూశానన్నారు. రాజకీయ లబ్ది కోసం టీఆర్ఎస్‌లో చేరడం లేదని స్పష్టం చేశారు. నిన్ననే టీఆర్ఎస్ టిక్కెట్ల పంపిణీ పూర్తయిందని, ఎన్నో అభివృద్ది పథకాల్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని సురేశ్ రెడ్డి చెప్పారు. అభివృద్ది పథకాలన్నీ కొనసాగాలంటే మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. అందుకు తన వంతు సాయం చేయడం కోసం టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు స్పష్టం చేశారు.

మరోవైపు 1989 నుంచి సురేష్ రెడ్డి, కేసీఆర్ మిత్రులని, పార్టీలు వేరైనా తెలంగాణ ఏర్పాటు కోసం కృషి చేశారని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పారు. తమ ఆహ్వానం మేరకు సురేశ్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరుతున్నారని తెలిపారు. సురేష్ రెడ్డి స్థాయికి తగ్గట్లుగా కేసీఆర్ ఆయనను గౌరవిస్తారని చెప్పారు. సురేశ్ రెడ్డికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని కేటీఆర్ చెప్పారు.

సురేశ్ రెడ్డి నివాసానికి వెళ్లిన టీఆర్ఎస్ నేతల్లో మాజీ ఎంపీ వివేక్ తదితరులున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*