
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ షాకిచ్చింది. మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డితో మాజీ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సమావేశం సురేశ్ రెడ్డి ఇంట్లోనే జరిగింది. కేటీఆర్‌తో పాటు ఇతర టీఆర్ఎస్ నాయకులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం తర్వాత టీఆర్ఎస్లో సురేశ్ రెడ్డి చేరతారా లేదా అనే విషయంపై క్లారిటీ వస్తుంది. అయితే సురేశ్ రెడ్డిని కేటీఆర్ టీఆర్ఎస్లోకి ఆహ్వానించారని సమాచారం. సమావేశం తర్వాత మీడియాతో కేటీఆర్, సురేశ్ రెడ్డి ముచ్చటించే అవకాశం ఉంది.
ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ సిద్ధమైన నేపథ్యంలో కేటీఆర్, సురేశ్ రెడ్డి భేటీకీ ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పటికే 105 మంది అభ్యర్ధులను ప్రకటించిన కేసీఆర్ కొన్ని స్థానాలను పెండింగ్‌లో పెట్టారు. అదే సమయంలో కీలక నేతలను పార్టీలోకి ఆహ్వానించేందుకు ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగిస్తున్నారు.
తెలంగాణలో బలంగా ఉన్న ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెసే కావడంతో ఆ పార్టీని వీలైనంత దెబ్బతీసేందుకు టీఆర్ఎస్ తీవ్రంగా యత్నిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మరింత మంది కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్లో ప్రత్యక్షమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పార్టీ శ్రేణులంటున్నాయి.
Be the first to comment