
చైనీస్ మొబైల్ మేకర్ వివో 8జీబీ ర్యామ్‌తో కూడిన ‘వివో ఎక్స్23’ని చైనాలో విడుదల చేసింది. వివోలోని ఇతర ఫోన్ల డిజైన్‌నే పోలి ఉన్న ‘వివో ఎక్స్23’ వాటర్‌డ్రాప్ డిస్ప్లే నాచ్ ఇన్ డిస్ప్లే, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3డీ గ్లాస్ బాడీ, జోవి ఏఐ, ఫేస్ అన్‌లాక్ ఉన్నాయి. అలాగే, 6.41 అంగుళాల డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 670 ఎస్వోసీ, 8జీబీ ర్యామ్, 3,400 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ ఇంకా మరెన్నో ఫీచర్లు ఉన్నాయి.
‘వివో ఎక్స్23’ ధర
ఈ ఫోన్ ధర చైనా కరెన్సీలో 3,498 సీఎన్వైలు. భారత కరెన్సీలో దాదాపు రూ.36,700. ఫేషన్ ఆరెంజ్, ఫ్యాషన్ పర్పల్, మిడ్నైట్ బ్లూ, ఫాంటమ్ పర్పుల్, ఫాంటమ్ రెడ్ కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఫ్యాషన్ ఆరెంజ్, ఫ్యాషన్ పర్పుల్ వేరియంట్లలో వెనక వివో లోగో పెద్ద పరిమాణంలో ఉంటుంది. ఈ నెల 14 నుంచి ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఫోన్ భారత్‌లో ఎప్పుడు విడుదల కాబోతోందన్న దానిపై ఇప్పటి వరకు స్పష్టత లేదు.
స్పెసిఫికేషన్లు: డ్యూయల్ సిమ్, ఫన్‌టచ్ ఓఎస్ 4.5 ఆధారిత ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 6.41 అంగుళాల ఫుల్ హెచ్డీ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, ఆక్టాకోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 670 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్ ఉన్నాయి.
‘వివో ఎక్స్23’లో 12 +13 మెగాపిక్సల్ డ్యూయల్ రియర్ కెమెరా, 12 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 128 జీబీ ఇన్‌బిల్ట్ మెమొరీ ఉన్నాయి. 4జీ వీవోఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్ 4.0, ఓటీజీ సపోర్ట్, 3,400 ఎంఏహెచ్ బ్యాటరీ, 22.5 వోల్ట్స్ ఫాస్ట్ చార్జింగ్ కలిగిన ఈ ఫోన్ బరువు 16.5 గ్రాములు మాత్రమే.
Be the first to comment