కాంగ్రెస్‌తో పొత్తుపై అధినేత కీలక నిర్ణయం!

హైదరాబాద్: టీటీడీపీ నేతలతో పార్టీ అధినేత చంద్రబాబు సమావేశం ముగిసింది. ఎన్నికల వ్యూహాలు, పొత్తుల ఖరారుపై చర్చించారు. తెలంగాణలో టీడీపీపై ఆదరణ తగ్గలేదని నేతలు చంద్రబాబుకు వివరించారు. 20 సీట్లలో 35 శాతం ఓటింగ్ పదిలంగా ఉందని టీటీడీపీ నేతలన్నారు. మరో 20 సీట్లలో 32 శాతం ఓటింగ్ ఉందని చెప్పారు. సమావేశంలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, నామా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్‌ను ఓడించేందుకు కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని టీటీడీపీ నేతలు యోచిస్తున్నారు. టీటీడీపీ నేతల సూచనల ప్రకారం చంద్రబాబు కాంగ్రెస్‌తో పొత్తుకు ఓకే చెప్పే అవకాశాలు కనపడుతున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌తో చంద్రబాబు సమావేశమయ్యే అవకాశాలున్నాయి. పొత్తు చిగురించే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇదే జరిగితే కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరినట్లౌతుంది. తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో స్థిరపడిన టీడీపీ అభిమానుల ఓట్లతో కాంగ్రెస్ పార్టీకి లబ్ది చేకూర్చనుంది. అయితే రాష్ట్రాన్ని నిలువునా చీల్చిన కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటే విమర్శలు తీవ్ర స్థాయిలో వచ్చే అవకాశముంది. పొత్తు కారణంగా ఏపీలో ఓటర్లు ప్రభావితులయ్యే అవకాశం ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*