తారక్, కళ్యాణ్‌ రామ్‌కు బాబు పరామర్శ

నందమూరి హరికృష్ణ దశదిన కర్మ హైదరాబాద్‌లో జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ, నారా లోకేశ్, రామ్మోహన్ నాయుడు, ఇతర ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, టీటీడీపీ నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. హరికృష్ణకు ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు నందమూరి తారకరామారావు, కళ్యాణ్ రామ్‌లను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. తారక్‌తో కరచాలనం చేసిన చంద్రబాబు కళ్యాణ్ రామ్ భుజంపై చేయి వేసి ఓదార్చారు. తాను అన్ని వేళలా, విధాలా అండగా ఉంటానని చెప్పారు. చంద్రబాబు తారక్, కళ్యాణ్‌రామ్‌లను పరామర్శిస్తున్న సమయంలో నందమూరి బాలకృష్ణ అక్కడే ఉన్నారు.

హరికృష్ణ దశదిన కర్మ ఫొటోలను జత చేస్తూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు. హరి మామయ్యకు నివాళులర్పించినట్లు తెలిపారు.

నందమూరి హరికృష్ణ గత నెల 29న నెల్లూరు వెళ్తూ నల్గొండ జిల్లా నార్కట్ పల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆయన మరణంతో టీడీపీ విషాదంలో మునిగిపోయింది.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*