బిగ్‌బాస్‌కు షాకిచ్చిన కౌశల్ ఆర్మీ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న బిగ్‌బాస్‌లో విజయం దిశగా దూసుకెళ్తన్న పోటీదారుల్లో కౌశల్ ఒకడు. కౌశల్‌కు బయట ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అతడి కోసం ‘కౌశల్ ఆర్మీ’ పేరుతో బయట ఏకంగా పెద్ద సైన్యమే తయారైందన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే, ఈ వార్తలను చాలామంది కొట్టపడేశారు. అలాంటిదేమీ లేదని, కొందరు వ్యక్తులు కావాలనే ఫేక్ మెయిల్ ఐడీలతో అతడికి ఓటేస్తున్నారన్న వారూ ఉన్నారు. అయితే, ఈ వార్తలన్నీ తప్పని, అతడి కోసం ఓ పెద్ద సైన్యమే పనిచేస్తోందని నిరూపించే ఘటన ఒకటి జరిగింది. బిగ్‌బాస్‌లో కౌశల్ విజయాన్ని ఆకాంక్షస్తూ వందలాది మంది కౌశల్ బొమ్మలున్న టీషర్టులు ధరంచి 2కే రన్ నిర్వహించి బిగ్‌బాస్‌కు షాకిచ్చారు.

బిగ్ బాస్ లో కౌశల్ విజయాన్ని కాంక్షిస్తూ, వందలాది మంది కౌశల్ బొమ్మలున్న టీషర్టులు ధరించి 2కే రన్ నిర్వహించి, బిగ్ బాస్ కు షాకిచ్చారు. కౌశల్ కోసం నిత్యం అప్రమత్తంగా ఉంటున్న ఆర్మీ అతడు ఎలిమినేషన్‌లోకి వెళ్లిన ప్రతిసారి భారీగా ఓట్లు వేసి అతడిని బయటపడేస్తోంది. కౌశల్ అభిమానులు ఆదివారం మాదాపూర్‌లో నిర్వహించనున్న 2కే ర్యాలీలో పాల్గొనాల్సిందిగా కౌశల్ ఆర్మీ శనివారం పిలుపునిచ్చింది. ఒక్క రోజు పిలుపుకే కౌశల్ అభిమానలు భారీగా స్పందించారు. ఈ రోజు ఉదయం నిర్వహించిన ర్యాలీలో అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిన్నపిల్లల నుంచి చిన్నపిల్లల తల్లుల వరకు ఈ ర్యాలీలో పాల్గొనడం విశేషం.

తమది పెయిడ్ ఆర్మీ అంటే ఇకపై ఊరుకునేది లేదని ఈ సందర్భంగా ర్యాలీకి వచ్చిన వారు హెచ్చరించారు. కౌశల్.. కౌశల్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ ర్యాలీని చూసిన వారు కౌశల్‌కు బయట ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా? అని నోరెళ్లబెడుతున్నారు. ఇది ఒక రకంగా బిగ్‌బాస్‌కు షాకేనని చెబుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*