కేసీఆర్‌ను ఓడించడమే లక్ష్యం: టీ.టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ

ఎట్టి పరిస్థితుల్లో మహా కూటమిని ఏర్పాటు చేస్తామని చంద్రబాబుతో సమావేశానంతరం టీ.టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ తెలిపారు. టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పాటుకు టీడీపీ ప్రయత్నిస్తోందన్నారు. అన్ని పార్టీలను కలుపుకుని మహాకూటమి ఏర్పాటు చేయాలని చంద్రబాబు చెప్పారని రమణ తెలిపారు. మహాకూటమిలోకి అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు.

టీడీపీని దెబ్బతియాలని ప్రయత్నించిన టీఆర్ఎస్, బీజేపీతో కలిసి పనిచేసే ఆలోచన లేదన్నారు. ఇప్పటి నుంచి అన్ని పార్టీలతో సంప్రదింపులు మొదలు పెడతామన్నారు. సీట్ల సర్దుబాటు కన్నా కేసీఆర్‌ను ఓడించడమే మహాకూటమి లక్ష్యమన్నారు.  తాజా రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు చంద్రబాబుకు వివరిస్తామని రమణ చెప్పారు.

అంతకు ముందుపార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు టీటీడీపీ నేతలతో సమావేశమై మూడు కమిటీలు ఏర్పాటు చేయాలని  సూచించారు. సాయంత్రంలోగా కమిటీలు ఖరారు చేయాలని ఆదేశించారు. బాబు ఆదేశాల ప్రకారం టీటీడీపీ ఎన్నికల సమన్వయ కమిటీ, ప్రచార కమిటీ, మేనిఫెస్టో కమిటీలను వేయనుంది.

తెలంగాణలో కలిసొచ్చే పార్టీలతో సంప్రదింపుల ప్రక్రియ వేగవంతం చేయాలని చంద్రబాబు సూచించారు. సీపీఐ, టీజేఎస్ పార్టీలతో సంప్రదింపులు జరుపుతామని నేతలు చంద్రబాబుకు తెలిపారు. సాయంత్రం సీపీఐ నేతలతో టీటీడీపీ నేతలు భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. రేపు కోదండరామ్‌తో మంతనాలు జరిపే అవకాశం ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*