
హైదరాబాద్: టీటీడీపీ నేతలతో ముగిసిన పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమావేశం కొద్ది సేపటి క్రితం ముగిసింది. మూడు కమిటీలు ఏర్పాటు చేయాలని చంద్రబాబు సూచించారు. సాయంత్రంలోగా కమిటీలు ఖరారు చేయాలని ఆదేశించారు. బాబు ఆదేశాల ప్రకారం టీటీడీపీ ఎన్నికల సమన్వయ కమిటీ, ప్రచార కమిటీ, మేనిఫెస్టో కమిటీలను వేయనుంది.
తెలంగాణలో కలిసొచ్చే పార్టీలతో సంప్రదింపుల ప్రక్రియ వేగవంతం చేయాలని చంద్రబాబు సూచించారు. సీపీఐ, టీజేఎస్ పార్టీలతో సంప్రదింపులు జరుపుతామని నేతలు చంద్రబాబుకు తెలిపారు. సాయంత్రం సీపీఐ నేతలతో టీటీడీపీ నేతలు భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. రేపు కోదండరామ్‌తో మంతనాలు జరిపే అవకాశం ఉంది. సమావేశానంతరం చంద్రబాబు అమరావతికి బయల్దేరారు.
కేసీఆర్‌ను ఓడించే లక్ష్యంతో టీడీపీ పొత్తులకు సిద్ధమౌతోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్‌తో పాటు ఏర్పాటయ్యే మహా కూటమిలో భాగమయ్యేందుకు కూడా వెనుకాడటం లేదు. అయితే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే ప్రజల నుంచి, క్యాడర్ నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశముందని తెలుస్తోంది.
Be the first to comment