
గుత్తి: అనంతపురం జిల్లా గుత్తి మండలం రాజాపురం గ్రామ సమీపంలో 63వ నెంబర్ జాతీయ రహదారి పక్కన దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని మహిళతో పాటు నాలుగు నెలల బాలుడిని దారుణంగా బండరాయితో మోది హత్య చేశారు.
ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మహిళపై అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. హత్యకు వివాహేతర సంబంధం కారణం అయ్యుండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. వేరే ప్రాంతంలో హత్య చేసి ఇక్కడ పడేసినట్లు కూడా పోలీసులు అనుమనిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.
Be the first to comment