
రాప్తాడు: అనంతపురం జిల్లా రాప్తాడు మండలం, గొందిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్ఆర్ఐటీ ఇంజనీరింగ్ కాలేజీలో బీ టెక్ మూడో సంవత్సరం చదువుతున్న మంజుల ప్రాణాలు తీసుకుంది. ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమని అనుమానిస్తున్నారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో విద్యార్ధుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. చదువుల ఒత్తిడి సహా కారణాలు ఎలాంటివైనా ఆత్మహత్యలు పరిష్కారం కాదని సైకాలజిస్ట్‌లు, కౌన్సిలర్లు సూచిస్తున్నారు. చర్చించడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని, తల్లిదండ్రులు, స్నేహితులతో చర్చించి పరిష్కారం కోసం యత్నించవచ్చంటున్నారు. ఒత్తిడిని అధిగమించే మార్గాలను అనుసరించాలని సైకాలజిస్ట్‌లు చెబుతున్నారు.
పుస్తక ( సాహిత్యం, ఆధ్యాత్మికం, స్వామి వివేకానంద సాహిత్యం) పఠనం వంటి మంచి అలవాట్ల ద్వారా సానుకూల వైఖరిని పెంచుకుని ప్రతికూల ఆలోచనలను అధిగమించవచ్చని మానసిక శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మార్కులు, ర్యాంకుల పేరుతో తల్లిదండ్రులు పిల్లలను ఒత్తిడికి గురిచేయడం సరికాదని కూడా నిపుణులు చెబుతున్నారు.
Be the first to comment