
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు- భువనేశ్వరి దంపతులు నేడు వివాహ వార్షికోత్సకోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 10 సెప్టెంబరు 1981లో అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి నారా చంద్రబాబునాయుడుతో ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరి వివాహం చెన్నైలోని కళైవానర్ ఆరంగం ఆడిటోరియంలో వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పలువురు జాతీయ, రాష్ట్ర రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.
Happy Anniversary Mom & Dad! Wishing that you celebrate many more such anniversaries with the same love and care for each other and remain the perfect couple that you truly are.
— Lokesh Nara (@naralokesh) September 10, 2018
తన తండ్రి వివాహా దినోత్సవాన్ని గుర్తు చేస్తూ మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. “అమ్మా, నాన్నా హ్యాపీ యానివర్సరీ. ఇటువంటి వార్షికోత్సవాలను మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నా. మీ ప్రేమాప్యాయతలను ఇలాగే చూపుతూ, పర్ఫెక్ట్ కపుల్ గా ఆదర్శంగా నిలవాలి” అని లోకేశ్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
Be the first to comment