
నిత్యా మీనన్, దుల్కర్ సల్మాన్ జంటగా మళయాలంలో సూపర్ హిట్ సినిమాగా నిలిచిన ‘ఉస్తాద్ హోటల్’ను ప్రముఖ నిర్మాత సురేష్ కొండేటి తెలుగులో ‘జనతా హోటల్’ పేరుతో తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్‌ను 7 రోజుల పాటు ఏడు టీజర్లుగా విడుదల చేస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు రెండో టీజర్‌ను విడుదల చేశారు.
#JanathaHotel 2nd Teaser Blockbuster Combination @dulQuer & #NityaMeanon Who Got Gud Nme wit Bilingual #OkBangaram Nw Paired up Fr #JanathaHotel Which Was a Blockbuster in Malayalam in te Nme of #UstadHotel Dis mve is Releasng in Telugu by Blockbuster Producr Suresh Kondeti pic.twitter.com/wCRc4svkTL
— Suresh Kondeti (@santoshamsuresh) September 8, 2018
హీరో దుల్కర్ సల్మాన్ విదేశాలకు వెళ్లి హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేస్తానని ఆసక్తి వ్యక్తం చేయడం.. అనుకున్న ప్రకారమే విదేశాలకు వెళ్లి చెఫ్ కోర్సు పూర్తి చేసి రాగానే పెళ్లి చూపులకు వెళ్లడం.. అక్కడ పెళ్లి కుమార్తె నీత్యామీనన్తో మాట్లాడుతుండగా.. ఆమె టీ కలుపుతూ ‘హౌ స్వీట్?’ అంటూ ప్రశ్నిస్తే.. ఇట్స్ క్యూట్, రొమాంటిక్ అంటూ తన ఫ్లోలో చెప్పడం.. ‘టీలో చెక్కెరెంత వేయమంటారో చెప్పండి’ అంటూ ఆమె మరింత క్యూట్‌గా అడగడం.. ఎంతగానో ఆకట్టుకుంటోంది.
శుక్రవారం విడుదలైన మొదటి టీజర్‌లాగే రెండో టీజర్ కూడా ఆద్యంతం ఆకట్టుకునేలా ఉండడం విశేషం.
Be the first to comment