
జనతా హోటల్ సెల్ఫీ విత్ చెఫ్ కాంటెస్ట్
విభిన్నమైన సినిమాలతో ఎప్పుడూ వైవిధ్యాన్ని కనబరిచే నిర్మాత సురేష్ కొండేటి. ప్రేమిస్తే, షాపింగ్‌మాల్, జర్నీ లాంటి మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించిన సురేష్ కొండేటి.. ఇప్పుడు మరో గొప్ప సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. ‘మహానటి’ ఫేం దుల్కర్ సల్మాన్, క్యూట్ హీరోయిన్ నిత్యామీనన్ జంటగా మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ఉస్తాద్ హెటల్ను తెలుగులో ‘జనతా హోటల్’ పేరుతో సెప్టెంబర్ 14న విడుదల చేయనున్నారు.
#JanathaHotel is Comng wit Interestng Contest Here are the Details: Click a Selfiee With a Chef (Hotel) Near Ur Place & Post it On Your Twitter & Facebook wit #SelfieWithChef & #JanathaHotelSelfie &Tag @SantoshamSuresh 1st 20 Members can win #JanathaHotel Tickets for Special Show pic.twitter.com/nK81mtUNp0
— Suresh Kondeti (@santoshamsuresh) September 8, 2018
డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలనుకునే ఈ యువతరంలో.. తాను చెఫ్‌గా మారలనుకునే హీరో కథతో ఎంతో ఆసక్తికరంగా సాగే సినిమా ఇది. విదేశాలకు వెళ్లి మరీ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేసొచ్చిన ఓ చెఫ్ చుట్టూ నడిచే కథ కావడంతో.. నిర్మాత సురేష్ కొండేటి ఒక ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
ఆ కాంటెస్ట్ గురించి నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ.. ‘‘ఇది ఒక చెఫ్‌కు సంబంధించిన కథ. నేడు, రేపు వీకెండ్ కావడంతో చాలామంది భాగ్యనగర వాసులు లంచ్, డిన్నర్ కోసం హోటల్స్‌ను ఆశ్రయిస్తుంటారు. అలా హోటల్‌కు వెళ్లిన వారు అక్కడ చెఫ్‌తో సెల్ఫీ దిగి దానికి #SureshKondeti #selfiewithchef, #janathahotelselfie
హ్యాష్‌ట్యాగ్‌లను జతచేసి మీ ట్విట్టర్, ఫేస్ బుక్ ఖాతాల్లో పోస్ట్ చేయాలి. అలా ట్వీట్ చేసిన వాళ్లలో 20 మందిని ఎంపిక చేసి ‘జనతా హోటల్’ స్పెషల్ షో చూసే అవకాశం కల్పిస్తాం.’’ అని తెలిపారు.
మరెందుకు ఆలస్యం.. మీరు హోటల్‌కు వెళితే.. చెఫ్‌తో సెల్ఫీ దిగి ట్వీట్ చేసేయండి. ‘జనతా హోటల్’ లాంటి ఫీల్‌గుడ్ మూవీ స్పెషల్ షో చూసే అదృష్టాన్ని గెల్చుకోండి.
Be the first to comment