మాజీ మిస్ యూనివర్స్ చెల్లీ కన్నుమూత.. షాక్‌కు గురైన సుస్మితా సేన్

అమెరికాకు మిస్ యూఎస్ఏ కిరీటం అందించి, ఆ తర్వాత మిస్ యూనివర్స్ అయిన చెల్సీ స్మిత్ (45) శనివారం కన్నుమూసింది. ఆమె మృతికి బాలీవుడ్ నటి, మిస్ యూనివర్స్-1996 విజేత సుస్మితాసేన్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసింది. 1995లో మిస్ యూనివర్స్‌గా ఎన్నికైన చెల్సీకి తాను కిరీటం తొడుగుతున్న ఫొటోను ఈ సందర్భంగా పోస్టు చేసింది. ఆ నవ్వంటే తనకు ఎంతో ఇష్టమని, తనలో స్ఫూర్తి నింపిందని తెలిపింది. తన అందమైన స్నేహితురాలి ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొంది.

1995 మిస్ యూనివర్స్ రన్నరప్ షన్నా మోక్లర్ కూడా ట్విట్టర్ ద్వారా చెల్సీకి తన సానుభూతి తెలిపింది. అత్యంత సన్నిహితురాలిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేసింది. చెల్సీ మరణవార్త విని తన హృదయం బద్దలైందని పేర్కొంది. ఆమె తన స్నేహితురాలు, తన జీవిత వెలుగు అని పేర్కొంది.

గత కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందింది. ఆమె మరణవార్త తెలిసి అభిమానులు, ఫాలోవర్లు షాక్‌కు గురయ్యారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*