
అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమవుతున్న మజ్లిస్ (ఏఐఎంఐఎం) జోరు పెంచింది. ఏడుగురు అభ్యర్థులతో కూడిన తొలి విడత జాబితాను ప్రకటించింది. పాతబస్తీలో తన పట్టును నిలుపుకోవడంతోపాటు ఈసారి మరింత విస్తరించాలని యోచిస్తున్న ఎంఐఎం పూర్తిస్థాయిలో సిద్ధమవుతోంది.
ఎంఐఎం విడుదల చేసిన తొలి జాబితా ప్రకారం.. చాంద్రాయణగుట్ట నుంచి మాజీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, యాకుత్‌పుర నుంచి అహ్మద్ పాషా ఖాద్రీ బరిలోకి దిగనున్నారు. అలాగే చార్మినార్ నుంచి ముంతాజ్ అహ్మద్ ఖాన్, బహదూర్‌పుర నుంచి మహ్మద్ మౌజమ్ ఖాన్, మలక్‌పేట నుంచి అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల, నాంపల్లి నుంచి జాఫర్ హుస్సేన్ మిర్జా, కార్వాన్ నుంచి కౌసర్ మొహీనుద్దీన్లకు తొలి జాబితాలో చోటు దక్కింది.
గత ఎన్నికల్లోనూ ఎంఐఎం నుంచి ఏడుగురు అభ్యర్థులు గెలుపొందారు. తాజాగా కచ్చితంగా గెలుస్తారనుకున్న వారికే పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ టికెట్లను కేటాయించారు.
Be the first to comment