బ్రేకింగ్ న్యూస్: కొండగట్టు లోయలో పడిన ఆర్టీసీ బస్సు.. 32 మంది మృతి

కరీంనగర్: కొండగట్టు వద్ద లోయలో ఆర్టీసీ బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 32మంది చనిపోయారు. 20 మంది గాయపడ్డారు. ఘటనా స్థలానికి భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పోలీసులు కూడా చేరుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తమ వారిని పోగొట్టుకున్న వారు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు.

ప్రమాద సమయంలో బస్సులో 80 మంది ప్రయాణికులున్నారు. మంగళవారం కావడంతో కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. స్వామిని దర్శించుకుని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికులంతా డ్రైవర్ వైపే ఒరిగి ఉండటమే ప్రమాదానికి కారణమైందని తెలుస్తోంది.

క్షతగాత్రులను జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న ఎస్పీ సింధూ శర్మ, కలెక్టర్ శరత్ చేరుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

కొండగట్టు ఘాట్ రోడ్డుపై జరిగిన ప్రమాదంపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రాణనష్టం జరగడంపై, అలాగే అనేకమంది గాయపడడంపై ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన వారికి వెంటనే సరైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*