
కడ్తాల్: గాదిగూడ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసి సర్కిల్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందిన జూపాక క్రిష్ణమూర్తి బదిలీపై వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.
నిర్మల్ జిల్లా సోన్ మండలం కడ్తాల్ గ్రామం వద్ద క్రిష్ణమూర్తి కారును ఎదiరుగా వచ్చిన మరో కారు ఢీ కొట్టింది. ఘటనలో క్రిష్ణమూర్తికి తీవ్ర గాయాలయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న క్రిష్ణమూర్తి భార్యకు కూడా గాయాలయ్యాయి. సి.ఐ. పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు.
Be the first to comment