
టెలికం రంగంలోకి అడుగుపెట్టి జియోకు నేటితో రెండేళ్లు. రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున జియో మార్కెట్లోకి అడుగుపెట్టి టెలికం రంగాన్ని షేక్ చేసింది. ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఖాతాదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.100కే అపరిమిత కాల్స్, డేటా ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ ఆఫర్ మూడు నెలలపాటు వినియోగించుకోవచ్చు. ఇందుకోసం ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీ ఫోన్ పేతో జియో ఒప్పందం కుదుర్చుకుంది.
జియో ఇప్పటికే రూ.399 ప్లాన్ అమలు చేస్తోంది. ఇందులో భాగంగా రోజుకు 1.5 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. ఇప్పుడీ ప్లాన్‌కు రూ.100 రాయితీతో రూ.299కే అందిస్తోంది. తాజా ఆఫర్లో వినియోగదారులకు ఉచిత అపరిమిత కాల్స్, రోజుకు వంద ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. అలాగే, ఈ రూ.100 డిస్కౌంట్ ప్లాన్‌లో రెండు ఆప్షన్లు ఇస్తోంది. జియో యాప్ ద్వారా రీచార్జ్ చేసుకుంటే రూ.50 క్యాష్‌బ్యాక్ ఓచర్లు లభిస్తాయి. ఈ ఓచర్లతో రూ.50 తక్షణ రాయితీ లభిస్తుంది. మై జియో యాప్‌లో ఉన్న ఫోన్ పే ఆప్షన్ ద్వారా రీచార్జ్ మొత్తం చెల్లిస్తే రూ.50 తక్షణ క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 12 నుంచి 21 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
Be the first to comment