
కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. 15 రోజుల్లోగా తమ ఎదుట హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ స్థలాల కేటాయింపులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై గత కొన్నేళ్లుగా విచారణ జరుగుతోంది. ఇందులో భాగంగా సీఆర్ పీసీ 41 సెక్షన్ కింద నోటీసులు ఇచ్చారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న 2003 నుంచి 2005 మధ్య సొసైటీ పాలక మండలిలో రేవంత్ రెడ్డి కూడా సభ్యుడిగా ఉన్నారు. ఆరోపణల నేపథ్యంలో నోటీసులు జారీ చేసిన పోలీసులు రేవంత్ రెడ్డితోపాటు సొసైటీలోని 13 మంది సభ్యులకు నోటీసులు జారీ చేశారు. నోటీసులకు స్పందించిన రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రక్రియలో తలమునకలై ఉన్నందున తనకు కొంత సమయం ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరారు. దీనిపై పోలీసులు స్పందించాల్సి ఉంది.
Be the first to comment