కృష్ణా జిల్లాలో విషాదం.. ప్రేమ వేధింపులకు యువతి బలి

కొణిజర్ల: కృష్ణా జిల్లాలో ప్రేమ వేధింపులకు యువతి బలైంది. గంపలగూడెం కొణిజర్లలో డిగ్రీ విద్యార్థిని ఝాన్సీ ఆత్మహత్య చేసుకుంది. ఝాన్సీకి అదే ప్రాంతానికి చెందిన గోపీ అనే యువకుడు వేధింపులు తీవ్రమయ్యాయి. నిన్న కాలేజీ నుంచి ఇంటికి వెళ్తున్న ఝాన్సీని గోపీ కొట్టాడు. దీంతో పొలం వద్ద పురుగులమందు తాగి ఝాన్సీ ఆత్మహత్య చేసుకుంది. పోలీసులకు ఫిర్యాదు అందింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఝాన్సీ రోజూ కాలేజీకి వెళ్లి వచ్చే సమయంలో తనను పెళ్లి చేసుకోవాలంటూ గోపీ వేధించేవాడని ఆమె తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. ఈ విషయంపై అనేకసార్లు గోపీని మందలించామని కూడా వారు చెబుతున్నారు. నిన్న కూడా ఝాన్సీ కాలేజీకి వెళ్లి వస్తున్న సమయంలో గోపీ అడ్డగించి పెళ్లిచేసుకోమని బెదిరించాడని చెప్పారు. ఝాన్సీ నిరాకరించడంతో చంపుతానని బెదిరించాడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిందని ఝాన్సీ బంధువులు తెలిపారు.

గోపీని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలంటూ ఝాన్సీ బంధువులు ఆందోళనకు దిగారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు కూడా పోనీయకుండా ఆందోళన చేపట్టారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడింది. పరారీలో ఉన్న గోపీ కోసం పోలీసులు వెతకడం ప్రారంభించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*