
మండపేట: ప్రపంచంలోనే అతి పెద్ద లడ్డు తయారీ సంస్థ తాపేశ్వరం సురుచి ఫుడ్స్ ఆధ్వర్యంలో ఈ ఏడాది చవితికి భారీ లడ్డు సిద్ధం చేశారు. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా 580 కేజీల భారీ లడ్డును రూపొందించారు. మండపేటకు చెందిన సూక్ష్మ కళాకారుడు వీరబాబు లడ్డుకు తుది మెరుగులు దిద్దారు. శివ పార్వతి ఆకారంలో జీడిపప్పు పేస్ట్‌తో రూపొందించారు.
లడ్డు తయారీ పూర్తయిన అనంతరం సురుచి ఆవరణలో ఏర్పాటు చేసిన మిఠాయి గణపతికి విశేష పూజలు నిర్వహించారు. సంస్థ అధినేత పొలిశెట్టి మల్లిబాబు ఆయన సతీమణి భారతి, కుమార్తె సాయి మనస్విని విశేష పూజలు చేశారు. అర్చకులు పుల్లకవి భాస్కరరావు ఆధ్వర్యంలో హోమాది కార్యక్రమాలు జరిగాయి. లడ్డు తయారు చేసిన మాలధారణ చేసిన సిబ్బంది బోలో గణేష్ మహరాజ్ అంటూ నినాదాలు చేశారు. ప్రజలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని లడ్డును సందర్శించారు. సెల్ఫీలు తీసుకొనేందుకు పోటీ పడ్డారు. మేళ తాళాలతో ఊరేగింపుగా అలంకరించిన వాహనంపై హైదరాబాద్ తరలించారు.
హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని దైవ సన్నిధానంలో ఏర్పాటు చేసిన మహా గణపతికి మహా నైవేద్యంగా ఈ లడ్డు ప్రసాదాన్ని గురువారం చవితి సంధర్భంగా సురుచి అధినేత పొలిశెట్టి మల్లిబాబు సమర్పించనున్నారు.
Be the first to comment