మళ్లీ తండ్రయిన గోపీచంద్.. బాబుకు జన్మనిచ్చిన రేష్మ

టాలీవుడ్ ప్రముఖ నటుడు గోపీచంద్ మరోమారు తండ్రయ్యాడు. ఆయన భార్య రేష్మా ఈ ఉదయం పండంటి బాబుకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని గోపీచంద్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. వినాయక చవితి నాడు మళ్లీ బాబు పుట్టాడని, ఇంతకంటే బెస్ట్ సర్‌ప్రైజ్ మరోటి ఉండదని పేర్కొన్నారు. టాలీవుడ్‌కు చెందిన మరో నటుడు శ్రీకాంత్‌కు బంధువైన రేష్మతో గోపీచంద్‌కు మే, 2013లో వివాహమైంది. గోపీచంద్‌-రేష్మ దంపతులకు ఇప్పటికే విరాట్ కృష్ణ అనే కుమారుడున్నాడు. బీటెక్ చేసిన రేష్మ.. త్రీడీ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ కోర్సులు కూడా పూర్తి చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*