
గనికపూడి: గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం గనికపూడిలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్తో తండ్రి, ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మృతి చెందారు. టేబుల్ ఫ్యాన్ పట్టుకోవడంతో షాక్ తగిలినట్లు తెలిసింది. మృతులు ప్రకాశం జిల్లా ద్రోణదలకు చెందినవారు.
మృతులను తండ్రి ఏసు(28), చిన్నారుల పేర్లు సాల్మన్(6), ఏస్తరి (3)గా గుర్తించారు. ఒక్కసారే కుటుంబంలోని ముగ్గురు చనిపోవడంతో వారి బంధువుల్లో విషాదం అలుముకుంది. గనికపూడిలో విషాదం నెలకొంది.
Be the first to comment