మహాకూటమిలోకి టీజేఎస్.. మరికాసేపట్లో కోదండరామ్ కీలక ప్రకటన!

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. టీఆర్ఎస్‌ను ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, టీడీపీ, సీపీఐల మధ్య చర్చలు ఫలప్రదం కాగా, తాజాగా ఈ కూటమిలోకి కోదండరామ్ పార్టీ తెలంగాణ జన సమితి (టీజేఎస్) కూడా వచ్చేందుకు అంగీకరించినట్టు సమాచారం.

టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఇంట్లో జరిగిన సమావేశంలో టీజేఎస్‌తో టీడీపీ, సీపీఐ నేతలు జరిపిన చర్చలు సఫలీకృతమయ్యాయి. కూటమి ఏర్పాటు, భవిష్యత్ కార్యచరణ వంటి వాటిని ప్రస్తావించారు. టీడీపీ నేతలు పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర్ తదితరులు హాజరయ్యారు. ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్న కాంగ్రెస్ నేతలు ఈ సమావేశానికి హాజరు కాలేదు. టీజేఎస్ మహాకూటమిలో చేరనున్నట్టు మరికాసేపట్లో కోదండరామ్ కీలక ప్రకటన చేయనున్నట్టు సమాచారం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*