అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకు వెళ్లే ఆలోచన లేదు: లోకేశ్

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని,  పూర్తికాలం అధికారంలో ఉండాలన్నదే తమ సెంటిమెంట్ అని మంత్రి నారా లోకేశ్ చెప్పారు.  హెచ్ సిఎల్ స్టేట్ స్ట్రీట్ ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు. తెలంగాణ ప్రయోజనాల కోసం నాడు బాబ్లీ కోసం చంద్రబాబు పోరాడారని లోకేశ్ గుర్తు చేశారు. ధర్మాబాద్ పోరాటంలో తెలుగుదేశం తెగువ ప్రజలు చూశారని, చంద్రబాబును, టీడీపీ నేతలను అరెస్ట్ చేసినా నాడు వెనక్కి తగ్గలేదన్నారు. అన్యాయంగా అరెస్ట్ చేసినందుకు చంద్రబాబు బెయిల్ కూడా తిరస్కరించారని చెప్పారు.

అంతకు ముందు హెచ్ సిఎల్ స్టేట్ స్ట్రీట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో లోకేశ్ ప్రసంగించారు.

నారా లోకేశ్ మాటల్లోనే…

12 నెలల క్రితం హెచ్ సిఎల్ అధినేత శివ్ నాడార్‌ని కలిశాను.

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి వివరించి రాష్ట్రానికి రావాలి అని ఆహ్వానించాను.

ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పై ఉన్న నమ్మకంతో హెచ్ సిఎల్ అధినేత శివ్ నాడార్ ఆంధ్రప్రదేశ్ కంపెనీ ఏర్పాటు కు అంగీకరించారు.

కంపెనీ ఏర్పాటుతో పాటు హెచ్ సిఎల్ భాగస్వామ్య కంపెనీలను కూడా ఆంధ్రప్రదేశ్ కి తీసుకొస్తా అని హామీ ఇచ్చి నిలబెట్టుకున్నారు.

హెచ్ సీఎల్ స్టేట్ స్ట్రీట్ కంపెనీ ఏర్పాటు తో వెయ్యి మందికి హై ఎండ్ ఉద్యోగాలు రాబోతున్నాయి.

ఇప్పటికే 300 మందికి ఈ కంపెనీ ఉద్యోగాలు ఇచ్చింది.

ఐటీ రంగం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సందర్భంలో హెచ్ సిఎల్ ఆంధ్రప్రదేశ్ లో కంపెనీ ఏర్పాటుకు ముందుకు వచ్చినందుకు అభినందిస్తున్నాను.

 

మంత్రి లోకేశ్ ప్రసంగం

 

హెచ్ సిఎల్ స్టేట్ స్ట్రీట్ ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఒక్కటి.

హెచ్ సిఎల్ స్టేట్ స్ట్రీట్ ఫైనాన్సియల్ సర్వీసెస్ అందిస్తుంది.

ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయాలు,శ్రమ వల్ల హైదరాబాద్ లో ఐటీ రంగం అభివృద్ధి చెందింది.

రాష్ట్ర విభజన సమయానికి మేధా టవర్స్‌లో కేవలం 20 శాతం మాత్రమే కంపెనీలు ఉన్నాయి.

ఇప్పుడు మేధా టవర్స్ పూర్తిగా ఐటీ కంపెనీలతో నిండిపోయింది…ఇప్పుడు టవర్ 2 నిర్మాణం వేగంగా జరుగుతుంది.

ఇప్పటికే ఐటీ రంగంలో 36 వేల ఉద్యోగాలు కల్పించాం.

2019 నాటికి లక్ష ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నాం.

స్థానికంగా నైపుణ్యం ఉన్న యువతి,యువకులు ఉన్నారు అనే పెద్ద ఎత్తున కంపెనీలు వస్తున్నాయి.

దేశ వ్యాప్తంగా ఉన్న హెచ్ సిఎల్ కంపెనీల్లో 30 శాతం తెలుగు వాళ్లు ఉన్నారు.

మంత్రి లోకేశ్ ప్రసంగం

 

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక కంపెనీల్లో తెలుగు వాళ్లు పనిచేస్తున్నారు…ఇప్పుడు వారంతా రాష్ట్రానికి తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారు.

ఐటీ కంపెనీల ఏర్పాటు కి ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తాం. వారికి ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కరిస్తున్నాం.

హెచ్ సిఎల్ కంపెనీ విద్యార్థి దశలోనే కాలేజీల్లో శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక ప్లాట్ ఫార్మ్ సిద్ధం చేసింది.

హెచ్ సిఎల్ తో భాగస్వామ్యం అయ్యి విద్యార్థి దశలోనే వారికి ఉద్యోగాలు అందిపుచ్చుకునే విధంగా నైపుణ్యాభివృద్ది శిక్షణ ఇస్తాం.

ఐటీ అభివృద్ధి కి కావాల్సిన మౌలిక వసతులు కల్పన వేగంగా జరుగుతుంది.

డిసెంబర్ నాటికి రాష్ట్రంలో 20 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి వస్తుంది.

హెచ్ సిఎల్ కంపెనీకి భూమి కేటాయించాం.అక్టోబర్ 8 భూమి పూజ చేసి పనులు ప్రారంభించబోతున్నారు.

 

మంత్రి లోకేశ్ ప్రసంగం..

రాష్ట్ర విభజన జరిగినప్పుడు మేధా టవర్స్ 20 శాతం మాత్రమే ఫుల్ అయ్యింది.

– ఇప్పుడు అంతా ఫుల్ అయ్యింది.

.. పక్కా బిల్డింగ్ కూడా కడుతున్నారు.

– సీఎం ప్రోత్సాహం వల్లే ఏపీకి కంపెనీలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.

– 2019 నాటికి లక్ష ఐటీ ఉద్యోగాలు వస్తాయని చెప్పాం.

– ప్రపంచంలో 10 మంది ఐటీ ప్రొఫెషనల్స్ లో ఒకరు ఏపీ నుంచి ఉంటారు.

– మనవారిలో టాలెంట్ ఉంది.

..వారిని ఆహ్వనించడం జరిగింది.

– వారికి ఏం సహాయం కావాలన్న యుద్ధప్రాతిపదికన పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది.

– ఏపీలో పెద్దఎత్తున యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*