‘యన్‌టీఆర్’ అభిమానులకు సర్‌ప్రైజ్.. కలిసొచ్చిన మామ-అల్లుడు!

వినాయక చవితి నాడు నందమూరి అభిమానులను ‘యన్‌టీఆర్’ చిత్రబృందం అలరించింది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఎన్టీఆర్, చంద్రబాబు ఫస్ట్ లుక్స్ మాత్రమే బయటకి రాగా, తాజాగా మామా అల్లుడు ఎన్టీఆర్, చంద్రబాబు కలిసి ఉన్న ఫొటోను విడుదల చేశారు. అల్లుడు చంద్రబాబు భుజంపై ప్రేమగా చేయివేసి ఎన్టీఆర్ మాట్లాడుతున్నట్టు ఉంది. ఈ ఫొటోలో ఎన్టీఆర్ పాత్రధారి బాలకృష్ణ, చంద్రబాబు పాత్రధారి రానా దగ్గుబాటి అచ్చుగుద్దినట్టు అలానే ఉన్నారు. ఇప్పటి వరకు విడుదలైన లుక్స్ కంటే ఈ పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఎన్‌బీకే ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎన్టీఆర్‌గా బాలకృష్ణ, ఆయన సతీమణి బసవతారకంగా బాలీవుడ్ నటి విద్యాబాలన్, అక్కినేని నాగేశ్వరరావుగా ఆయన మనవుడు సుమంత్ నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*