
రమ్యకృష్ణ గారు మీకు ముందుగా బర్త్‌డే విషెస్.. ఈ పుట్టినరోజు కానుకగా శైలజారెడ్డి అల్లుడు మంచి విజయాన్ని సాధించటం ఎలావుంది.?
మీకు ధన్యవాదాలు.. ఈ పుట్టినరోజుకి ఓక మంచి చిత్రం సూపర్‌హిట్ అవ్వటం చాలా ఆనందంగా వుంది. అలాగే ఈ చిత్రంలో అందరూ చాలా జెన్యూన్ గా కష్టపడ్డారు.. వారందరికి నా ప్రత్యేక శుభాకాంక్షలు.
Thank you thank you so much for this..to all of you out there who enjoyed the film and spread the love..to those who didn’t promise to try harder on the next one and to those who haven’t watched it.. go watch it!entertainment guaranteed:-)#shailajareddyalludu #PeoplesBlockbuster pic.twitter.com/TBdVjLnIgd
— chaitanya akkineni (@chay_akkineni) September 14, 2018
శైలజారెడ్డి అల్లుడు చిత్రం చూసిన వారంతా మీ పాత్ర కొసం ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు.. ఈ రెస్పాన్స్ మీద మీ కామెంట్.
డెఫినెట్ గా శైలజారెడ్డి పాత్ర వైవిధ్యంగా వుంటుంది. ఒక సైడ్ ఊరులో ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే ఏంతవరకైనా పోరాడే ధీరత్వం.. మరో వైపు తల్లిగా కూతురు మీద ప్రేమ.. సమస్య వస్తే ఎదుర్కునే ధైర్యం ఇన్ని వున్నాయి శైలజారెడ్డి పాత్రలో.. మారుతి గారు ఈ పాత్రని మలిచిన విధానం చాలా బాగుంది. ఈ చిత్రంలొ అత్త పాత్ర రెగ్యులర్ గా ఉండదు.. మీరు ఎప్పూడూ చూస్తున్న అత్త అల్లుళ్ళ మద్య కామెడి కూడా ఈ చిత్రం లో కనిపించదు. చూసిన వారికి , చూసేవారికి స్వీట్ సర్పరైజ్ లా వుంటుంది.
Just for laughs ! Some fun interactions during #ShailajaReddyAlludu promotions
https://t.co/ibPdq5sjdnhttps://t.co/VBBRAc1Fs8 https://t.co/HYkhwwyy1b— chaitanya akkineni (@chay_akkineni) September 14, 2018
ఈ చిత్రం లో మీది ఇగో కేరక్టర్ కదా.. ?
అది ఓ పక్క వుంటుంది.,. కాని సీన్స్ అన్ని కొత్తగా వుంటాయి. చాలా బాగుంటాయి.. కొత్త అత్త, అల్లుడ్ని చూస్తారు. ఈ చిత్రంలో…
ఇక్కడ అత్త కి ఇగోనే కూతురికి ఇగోనే పాపం అల్లుడు కదా.. అల్లుడు మీద జాలి వేయలేదా మీకు..?
హహహ నిజం అండి అత్త గా నాకు ఇగో , కూతురికి ఇగో ఇక్కడ వరకూ నేను ఎంజాయ్ చేశాను.. సేమ్ నాలాంటి పాత్ర ఇంకోకటి నాకు తోడుగా వుంది అని పాపం చైత్యన్య గారికి మాత్రం ఫుల్ టెన్షన్ వుంది.. కాని మీరు చూస్తే ఇవన్ని ఫన్ జెనెరేట్ చేస్తాయి. మా ముగ్గురి మద్యలో నరేష్ గారు, మాణిక్యం గా ఫృధ్వి గారు, వెన్నెల కిషోర్ గారు కేరక్టర్స్ కామెడి గా వుంటాయి.. కొన్ని సార్లు కామెడి కి షూట్ కూడా ఆపేసి నవ్వేవాళ్ళం.. నేను బాగా ఎంజాయ్ చేశాను.
మీరు నాగార్జున గారితో చేశారు.. ఇప్పడు నాగచైతన్య గారికి అత్తగా చేశారు.. చైతన్య గారు యాక్టింగ్ ఎలావుంది..?
చాలా హ్యపిగా వుంది. నాగచైతన్య వెరీ డౌన్ టు ఎర్త్ వుండే మనిషి. యాక్టింగ్ లో చాలా గ్రోత్ అయ్యాడు. ముఖ్యంగా నన్ను, అను ని కన్విన్స్ చేసే సీన్ వుంది అక్కడ చాలా ఈజ్ తో మెచ్చూర్డ్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు.. వెరి గుర్ ఆర్టిస్ట్.
#ShailajaReddyAlludu takes the biggest opening for @chay_akkineni
Also, one of the biggest openings in Telugu states for 2018..
Day1 shares
Nizam – 2.50
Ceeded – 1.04
UA – 0.82
East – 0.72
West – 0.42
Krishna – 0.40
Nellore – 0.23
Guntur – 0.80
Total Ap/Tg – 6.93cr pic.twitter.com/rJh30qqwNZ— Ramesh Bala (@rameshlaus) September 14, 2018
డైరక్టర్ మారుతి గారు వర్కింగ్ స్టైల్ ఎలా వుంది.. సీనియర్ గా ఎమైనా టీజ్ చేశారా..?
టీజ్ చేయటమా అంత టైమ్ ఇవ్వరు ఈ డైరక్టర్.. బాబోయ్ స్పీడ్ గా వర్క్ చేస్తారు. మిషన్ లా … జస్ట్ రెడి అయ్యి కూర్చుందామనుకునే సరికి రెడి రెడి అని కాల్ చేస్తారు. ఓక రోజు వర్షం పడుతుంది కదా వదిలేస్తాడేమో అనుకున్నా.. ఆ గ్యాప్ లో కూడా తీసేసారు.. వెరి గుడ్ ఫ్యూచర్ వుంది. వెరి గుడ్ ప్లానింగ్.. నా కెరీర్ లో ఇంత ఫాస్ట్ గా షూటింగ్ చేసి ఇంత ఫాస్ట్ గా ఇచ్చిన చిత్రం శైలజారెడ్డి మాత్రమే..
మీరు సీరియస్ పాత్ర ఎలా చేస్తారో అంతే ఈజిగా కామెడి కూడా చేస్తారు.. ఎలా అంత ఈజి వస్తుంది మీకు..?
అలా ఏమి కాదు ఆర్టిస్ట్ అంటే అన్ని చేయ్యాలి.. కొ-ఆర్టిస్ట్ పెర్ఫెక్ట్ గా వుంటే కామెడి చాలా బాగా వస్తుంది అది కూడా స్పాంటెనియస్ గా వస్తుంది.. నేను కామెడి బాగా చేసింది పంచతంత్రం చిత్రం ఈ శైలజారెడ్డి అల్లుడులో నా చుట్టూ కామెడి జరుగుతుంది. హిలెరియస్ గా వుంటుంది కాని నేను సీరియస్ గా వుండాలి.. ఇది నాకు ఢిఫకల్ట్ గా అనిపించింది.
సినిమాటోగ్రాఫర్ నిజార్ షఫి గురించి చెప్పండి..?
మీరు సినిమా లో చూశారు అందరూ చాలా అందంగా వున్నారు.. కాని మారుతి గారు వర్క్ స్పీడ్ కి ఆయన పరిగెత్తి పరిగెత్తి షూట్ చేసేవాడు పాపం.. గ్రేట్ పీపుల్ తో వర్క్ చేశాను అనే ఫీలింగ్ వుంది నాకు.
మీరు భాహుబలి చిత్రం తరువాత కొంచెం గ్యాప్ తీసుకుని ఇలా అత్తగా కనిపించారు.. మరి ఇలాంటి రోల్స్ వస్తే చేస్తారా..?
నేను చేసిన వెరైటి రోల్స్ మాత్రమే నన్ను ఆర్టిస్ట్ గా నిలబెట్టాయి.. సో ఇలాంటి వైరైటి రోల్స్ వస్తే తప్పకుండా చేస్తాను.
ఈ సినిమా నిర్మాతల గురించి చెప్పండి..?
చాలా ఫ్యాషనేట్ ప్రోడ్యూసర్స్ అలాగే దర్శకుడ్ని నమ్మి నటీనటుల్ని నమ్మి ఇలా చిత్రాలు చేసే నిర్మాతలు చాలా అరుదుగా వుంటారు. వారికి నా తరుపున కంగ్రాట్స్..
చివరిగా మీరు ఈ చిత్రం గురించి..?
చాలా మంచి చిత్రం.. చక్కటి ఫ్యామిలి ఎంటర్టైనర్ గా అందరూ ఆదరిస్తున్నారు. ఇలాగే శైలజారెడ్డి అల్లుడ్ని మరింత ఆదరించాలని కోరుకుంటున్నాను.
Be the first to comment