మిర్యాలగూడలో పట్టపగలు పరువు హత్య

మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో పట్టపగలు పరువు హత్య జరిగింది. మిర్యాలగూడలో ఆరు నెలల క్రితం ప్రముఖ వ్యాపారి మారుతిరావు కుమార్తె అమృత వర్షిణిని ప్రేమించి పెళ్లి చేసుకున్న పెరుమళ్ల ప్రణయ్ కుమార్ అనే దళిత యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. తన భార్య అమృత వర్షిణితో కలిసి ఆస్పత్రి నుంచి బయటకు వస్తుండగా వెనకాల నుంచి ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. ప్రణయ్ కుమార్‌ను తలపై నరకడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అమృత వర్షిణి అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ప్రణయ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

 

 

ప్రణయ్, అమృత వర్షిణి ఇద్దరు మేజర్లు కావడంతో ఆరు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. అమృత తల్లిదండ్రులకు ఇష్టం లేకున్నా ప్రణయ్ తల్లిదండ్రులు, బంధువుల సమక్షంలో పెళ్లి ఘనంగా జరిగింది. వీరి ప్రేమ విషయం తెలిసిన నాటి నుంచే అమృత తల్లిదండ్రులు తమ కూతురికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయినా ప్రణయ్ నే చేసుకుంటానంటూ పట్టుపట్టి పెళ్లి చేసుకున్నది. పెళ్లి తర్వాత కూడా చాలాసార్లు అమృత తండ్రి మారుతిరావు ప్రణయ్‌ను, వారి కుటుంబ సభ్యులను బెదిరించారు. వారిద్దరూ కలిసి కాపురం చేస్తుంటే అమృత తల్లిదండ్రులకు అస్సలు నచ్చలేదని సమాచారం. ఇలా ఉండగా అమృతకు అనారోగ్యంగా ఉండడంతో పట్టణంలోని జ్యోతి ఆస్పత్రికి పలుమార్లు వైద్యం కోసం వచ్చారు. అదే క్రమంలో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ప్రణయ్, ప్రణయ్ సోదరి, అమృత వర్షిణి కలిసి జ్యోతి ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చారు. గత కొద్దిరోజులుగా ప్రణయ్‌ని కొందరు వ్యక్తులు ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.

 

 

ఈ క్రమంలో ఈ రోజు కూడా ప్రణయ్ ఆస్పత్రిలోకి ప్రవేశించిన సమయంలోనే ఇద్దరు దుండగులు కూడా వచ్చినట్లు తెలిసింది. డాక్టర్‌కు చూపించుకుని బయటకు వస్తుండగా వారి వెనకాలే ఓ దుండగుడు కత్తి చేత పట్టుకుని అనుసరించాడు. ఆస్పత్రి గేట్ దాటగానే ఒక్కసారిగా కత్తితో మెడపై బలంగా నరికాడు. కింద పడిన తర్వాత మరో దెబ్బ వేసాడు. పక్కనే ఉన్న అమృత అడ్డుకునే ప్రయత్నం చేయగా దుండగుడు పారిపోయాడు. ప్రణయ్ అక్కడిక్కడే ప్రాణాలు కొల్పాయడు. ప్రణయ్ హత్యేలో అమృత తండ్రి పాత్ర ఉండవచ్చని ఎస్పీ రంగనాధ్ అనుమానం వ్యక్తం చేశారు. హత్య జరగానే ఎస్పీ సంఘటన స్థలాన్ని సందర్శించారు. వివరాలు సేకరించారు. హత్య చేసిన వ్యక్తి కిరాయి హంతకుడు అయి ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రేమ వివాహం అమృత తండ్రికి నచ్చకపోవడం వల్లు ప్రణయ్ హత్యకు దారితీసునట్లు తెలుస్తుంది. ప్రణయ్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేస్ నమోదు చేసుకుని విచారిస్తున్నారు. ప్రణయ్ హత్యతో అమృత ఒక్కసారిగా షాక్‌కు గురైంది. స్పృహ కోల్పోవడంతో ఆసుపత్రిలో చేర్పించారు.

 

 

పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఘటనతో మిర్యాలగూడలో ఒక్కసారిగా కలకలం రేగింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*