
విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలంటూ జనసేన కార్యకర్త షేక్ ఫయాజ్ మోకాళ్ళపై ఇంద్రకీలాద్రికి చేరుకున్నాడు. పవన్ పోటో పట్టుకుని మోకాళ్ళపై కనకదుర్గమ్మ గుడికి చేరుకున్నాడు. ఫయాజ్ గుడికి చేరుకునేందుకు అతడి స్నేహితులు సహకరించారు.
సామన్యులకు న్యాయం జరగాలని, రాష్ట్రంలో అన్ని కులాలు, వర్గాలకు న్యాయం జరగాలంటే పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అయితేనే సాధ్యమని ఫయాజ్ చెప్పాడు. యువతరం తలరాతలు మారాలంటే పవన్ సియం కావాలన్నాడు. అధికార పార్టీ నేతలు జనసేన పార్టీ బలపడకుండా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఫయాజ్ ఆరోపించాడు.
రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన పోయి, ప్రజలు మెచ్చే పాలన రావాలన్నారు. అందుకే కనకదుర్గమ్మను వేడుకుంటూ మోకాళ్ళపై నడుచుకుంటూ ఇంద్రకీలాద్రికి వచ్చానని ఫయాజ్ చెప్పాడు.
Be the first to comment