
హైదరాబాద్: టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నాడంటూ టికెట్ కలెక్టర్ వెంటాడటంతో ప్యాసింజర్ పరుగులు తీశాడు. చివరకు ట్రైన్ కింద పడి రెండు ముక్కలయ్యాడు. ఘటన తాండూరు-నాంపల్లి ప్యాసింజర్ ట్రైన్లో జరిగింది.
టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న యువకుడిని పట్టుకునేందుకు టికెట్ కలెక్టర్ యత్నించాడు. ఈ క్రమంలో భయంతో యువకుడు పరుగులు తీశాడు. అయినా వదలని టీసీ వెంటాడాడు. దీంతో ప్యాసింజర్ ట్రైన్ కిందపడి రెండు ముక్కలయ్యాడు. ఈ విషాదకర ఘటన గొల్లపూడి స్టేషన్ వద్ద జరిగింది. కోపోద్రిక్తులైన తోటి ప్రయాణికులు ట్రావెలింగ్ టికెట్ ఇన్స్పెక్టర్ను చితకబాదారు. అనంతరం స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. టీటీఐపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
పేదరికమో లేక మరే కారణమో తెలియదు కానీ ప్యాసింజర్ టికెట్ లేకుండా ప్రయాణించాడు. అదే అతడి పాలిట శాపమైంది. రైల్వే పోలీసులకు అప్పగిస్తే పరువు పోతుందనుకుని పరుగులు తీశాడు. చివరకు ప్రాణాలే పోగొట్టుకున్నాడు.
టికెట్ లేకపోతే ఫైన్ వేయాలి. లేదా రైల్వే పోలీసులకు అప్పగించాలి. అంతేకాని ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాటవద్దని ప్యాసింజర్లు రైల్వే అధికారులపై మండిపడుతున్నారు.
మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. దర్యాప్తు కొనసాగుతోంది.
Be the first to comment