చైనా పర్యటనలో లోకేశ్.. 23న చంద్రబాబు అమెరికా పర్యటన

అమరావతి: మంత్రి లోకేశ్ చైనా పర్యటనకు బయలుదేరారు. వారం రోజులపాటు ఆయన చైనాలో పర్యటిస్తారు. వివిధ సంస్థల ప్రతినిధులతో భేటీ అవుతారు. 11 కీలక సమావేశాల్లో పాల్గొంటారు. ఏపీలో పెట్టుబడులు ఎలక్ట్రానిక్ రంగంలో అవకాశాలపై లోకేశ్ చర్చిస్తారు.

 

చైనాలోని తియాంజిన్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో కూడా లోకేశ్ పాల్గొంటారు. పెట్టుబడిదారులతో సమావేశమౌతారు. వివిధ కార్పొరెట్ పెద్దలతో భేటీ అవుతారు.

కాగా ఈనెల 23 నుంచి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. పర్యటన బాధ్యతలను ఎంపీ సీఎం రమేశ్‌కు అప్పగించారు. రాష్ట్రానికి పెట్టుబడుల విషయంలో అందరినీ సమన్వయం చేయాలని సీఎం ఆదేశించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*