
అమరావతి: మహబూబాబాద్ జిల్లా టీడీపీ సీనియర్ నాయకుడు బానోత్ మోహన్ లాల్ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును కలుసుకున్నారు. చంద్రబాబు పిలుపు మేరకు మోహన్ లాల్ ఆయన భార్య లక్ష్మి అమరావతికి చేరుకుని మహబూబాబాద్ జిల్లా పరిస్థితులను వివరించారు.
బానోత్ మోహన్ లాల్ 2014లో తెలుగుదేశం తరపున ఎంపీగా పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత 2016లో టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున టికెట్ ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినా ఆయన విడుదల చేసిన జాబితాలో మోహన్‌లాల్ పేరు లేదు.
టీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో బానోత్ మోహన్ లాల్ దంపతులు పది రోజుల క్రితం హైదరాబాద్‌లో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఆ తర్వాత చంద్రబాబు పిలుపు మేరకు అమరావతికి చేరుకుని చర్చలు జరిపారు. మహాకూటమి పొత్తుల నేపథ్యంలో తనకే టీడీపీ టికెట్ దక్కేలా చూడాలని మోహన్‌లాల్ టీడీపీ అధినేతను కోరారు. టికెట్ తప్పకుండా ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Be the first to comment