
హైదరాబాద్: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణానగర్‌లో దారుణ హత్య జరిగింది. భార్య ఆసిఫాను భర్త మహ్మద్ సిరాజ్ చంపేశాడు. తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఈ హత్య జరిగింది. అనంతరం పరారయ్యాడు.
బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావ్ తెలిపిన వివరాల ప్రకారం కృష్ణానగర్ సీ బ్లాక్‌లో ఉదయం నాలుగు గంటలకు హత్య జరిగినట్టు సమాచారం వచ్చిందన్నారు. క్లూస్ టీం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుందని చెప్పారు. భర్తే భార్యను హత్యచేసినట్టు ప్రాథమికంగా గుర్తించామని తెలిపారు. సిరాజ్ కోసం గాలింపు చేపట్టామన్నారు.
కొద్ది రోజుల నుంచి సిరాజ్ హఫీజ్‌పేట్‌లోని స్థలం కోసం భార్య ఆసిఫాతో గొడవ పడేవాడని బంధువులు ఆరోపిస్తున్నారు. సిరాజ్, ఆసిఫాలకు నాలుగు సంవత్సరాల బాబు ఉన్నాడు. ఘటనతో కృష్ణానగర్‌లో కలకలం రేగింది.
Be the first to comment