బీఎస్ఎన్ఎల్ నుంచి మరో రెండు ప్యాక్‌లు.. చవకైన డేటా ప్యాక్ కూడా!

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ మరో రెండు వాయిస్ ప్యాక్‌లు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిళ్ల ఖాతాదారులే లక్ష్యంగా రూ.105, రూ.328తో వీటిని తీసుకొచ్చింది. ఈ ప్యాక్‌లలో ఖాతాదారులకు అపరిమిత లోకల్, ఎస్టీడీ, రోమింగ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. వీటికి బీఎస్ఎన్ఎల్ అనంత్, బీఎస్ఎన్ఎల్ అనంత్ ప్లస్ అని పేర్లు పెట్టింది. ఇతర సర్కిళ్లలనూ ఇటువంటి రీచార్జ్ ప్యాక్‌లే అందుబాటులో ఉన్నప్పటికీ వాటి ధరలు వరుసగా రూ.99, రూ.319గా ఉన్నట్టు సమాచారం.

రూ.105 రీచార్జ్ ప్యాక్‌ బీఎస్ఎన్ఎల్ అనంత్‌ కాలపరిమితి 26 రోజులు. ఇందులో ఎటువంటి డేటా, ఎస్సెమ్మెస్ ప్రయోజనాలు ఉండవు. కేవలం వాయిస్ కాల్స్‌కు మాత్రమే లభిస్తాయి. ఇక రూ.328 రీచార్జ్ ప్యాక్ బీఎస్ఎన్ఎల్ అనంత్ ప్లస్‌లో అచ్చం ఇటువంటి ప్రయోజనాలే ఉన్నప్పటికీ కాలపరిమితి 90 రోజులు. అయితే, ఉచిత కాల్స్ ఢిల్లీ, ముంబై సర్కిళ్లకు వర్తించవు.

ఇక డేటా ప్రియుల కోసం రూ.98తో మరో రీచార్జ్ ప్యాక్‌ను ప్రవేశపెట్టింది. దీనిపేరు డేటా సునామీ ప్యాక్. ఈ ప్యాక్‌‌లో రోజుకు 1.5 జీబీ డేటా 26 రోజుల కాలపరిమితో లభిస్తుంది. మొత్తం 39 జీబీ డేటా అన్నమాట. అంటే ఒక జీబీ ధర రూ. 2.5 మాత్రమే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*