
స్మార్ట్ టీవీ తయారీ రంగంలోకి మరో మొబైల్ కంపెనీ అడుగు పెడుతోంది. వన్‌ప్లస్ పేరుతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విఫణిలో సంచలనం సృష్టిస్తున్న ఈ చైనీస్ కంపెనీ వన్‌ప్లస్ టీవీ పేరుతో టీవీ తయారీ రంగంలోకి ప్రవేశించింది. ఈ విషయాన్ని సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో పేట్ లా తెలిపారు. తొలి యూఎస్బీ టైప్-సీ హెడ్‌ఫోన్స్‌ను త్వరలోనే విడుదల చేయబోతున్నట్టు ఇటీవలే ప్రకటించిన వన్‌ప్లస్ ఇప్పుడు టీవీ తయారీ రంగంలోకీ ప్రవేశించినట్టు వ్యాపారవర్గాలను ఆశ్చర్యపరిచింది.
ఇటీవల వచ్చిన వన్‌ప్లస్ 6 మొబైల్‌కు సక్సెసర్‌గా త్వరలోనే వన్‌ప్లస్ 6టీని సంస్థ విడుదల చేయబోతోంది. దాంతోపాటే యూఎస్బీ టైప్-సీ హెడ్‌ఫోన్స్‌ను కూడా విడుదల చేయనుంది. ప్రస్తుతం భారత్‌లోని ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్లో వన్‌ప్లస్ రెండో స్థానంలో ఉంది. మార్కెట్లో 25 శాతాన్ని సొంతం చేసుకుంది. ఈ సెగ్మెంట్లో శాంసంగ్ 48 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది.
త్వరలోనే టీవీల ఉత్పత్తని ప్రారంభిస్తున్నట్టు వన్‌ప్లస్ వెల్లడించినప్పటికీ స్క్రీన్ సైజు, ఆపరేటింగ్ సిస్టం వంటి వాటి వివరాలను వెల్లడించలేదు. ప్రీమియం ఫ్లాగ్షిప్ టీవీగా వస్తున్న వీటిని వచ్చే ఏడాది మార్కెట్లోకి తీసుకురానున్నట్టు కంపెనీ అధికారి ఒకరు తెలిపారు. కాగా, స్మార్ట్ రంగంలో భారత మార్కెట్‌ను ఏలుతున్న చైనీస్ మేకర్ షియోమీ ఇప్పటికే టీవీలను ఉత్పత్తి చేస్తోంది. ఎంట్రీ లెవల్ ఎల్ఈడీ టీవీలను అతి తక్కువ ధరకే అందిస్తోంది. ఇప్పుడు ఈ కంపెనీకి వన్‌ప్లస్ గట్టి పోటీ ఇవ్వనుంది.
Be the first to comment